ETV Bharat / city

Telangana Cabinet: కృష్ణానదిపై కొత్త ఆనకట్ట నిర్మించాలని నిర్ణయం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. కృష్ణానదిపై కొత్త ఆనకట్ట నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

barrage on Krishna river
కృష్ణానదిపై కొత్త ఆనకట్ట
author img

By

Published : Jun 20, 2021, 6:36 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాయలసీమ ఎత్తిపోతల, ఆర్డీఎస్ కుడి కాల్వలపై కేబినెట్‌ నిరసన వ్యక్తం చేసింది. ఎన్జీటీ, కేంద్రం ఆదేశాలను ఏపీ ప్రభుత్వం బేఖాతరు చేసిందన్న మంత్రివర్గం.. కేంద్ర వైఖరితో రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగే పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించింది.

కృష్ణానదిపై కొత్త ఆనకట్ట..

కృష్ణానదిపై కొత్త ఆనకట్ట నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జోగులాంబ గద్వాల - వనపర్తి జిల్లాల మధ్య కృష్ణానదిపై అలంపూర్‌ వద్ద గుమ్మడం, గొందిమల్ల, వెలటూరు, పెద్దమారూరు గ్రామాల పరిధిలో ఆనకట్ట నిర్మించాలని ఖరారు చేసింది. జోగులాంబ ఆనకట్ట ద్వారా 60-70 టీఎంసీల వరద నీటిని పైప్‌లైన్‌ ద్వారా తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన ఏదుల జలాశయానికి నీటిని ఎత్తిపోసి పాలమూరు, కల్వకుర్తి ప్రాజెక్టుల ఆయకట్టు అవసరాలను తీర్చాలని కేబినెట్‌ నిర్ణయించింది.

ఇదీ చూడండి:

సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనకు సిద్ధమైన అధికార యంత్రాంగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.