ETV Bharat / city

TS Inter board: ఇంటర్ పరీక్షల విధానంలో కీలక మార్పులు - తెలంగాణ తాజా వార్తలు

ఇంటర్మీడియట్‌ విద్యా సంవత్సరాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఆన్‌లైన్‌ తరగతులతో కలిపి 220 పని దినాలతో విద్యా సంవత్సరాన్ని ఖరారు చేసింది. దసరాకు ఆదివారంతో కలిపి 5 రోజులు, సంక్రాంతికి జనవరి 13 నుంచి 15 వరకు సెలువులు ప్రకటించింది. ఇంటర్‌ పరీక్షల నిర్వహణ విధానంలోనూ రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. అర్ధ సంవత్సర, ప్రి ఫైనల్‌ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.

TS Inter board
ఇంటర్ బోర్డు
author img

By

Published : Sep 7, 2021, 12:55 AM IST

తెలంగాణ ఇంటర్ బోర్డు... విద్యాసంవత్సరం షెడ్యూల్​ను ఖరారుచేసింది. ఈ ఏడాది పరీక్షల విధానంలో కీలక మార్పులు చేసిన అధికారులు.... అర్ధ సంవత్సరం, ప్రి ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆన్​లైన్ తరగతులతో కలిపి విద్యా సంవత్సరంలో 220 పనిదినాలు ఉండనున్నాయి. దసరాకు ఆదివారంతో కలిపి 5 రోజులు, జనవరి 13 నుంచి 15 వరకు 3 రోజులు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. డిసెంబర్ 13 నుంచి 18 వరకు అర్ధ సంవత్సరం పరీక్షలు జరగనుండగా... ఫిబ్రవరి 10 నుంచి 18 వరకు ఇంటర్ ప్రి ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఫిబ్రవరి 23 నుంచి మార్చి 15 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు, మార్చి 23 నుంచి ఏప్రిల్ 12 వరకు వార్షిక పరీక్షలు, మే చివరి వారంలో అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 14 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు అనంతరం... జూన్ 1న ఇంటర్ కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి.

ముఖ్యమైన తేదీలు..

  • డిసెంబర్‌ 13 నుంచి 18 వరకు అర్ధ సంవత్సర పరీక్షలు.
  • ఫిబ్రవరి 10 నుంచి 18 వరకు ప్రి ఫైనల్‌ పరీక్షలు.
  • ఫిబ్రవరి 23 నుంచి మార్చి 15 వరకు ఇంటర్‌ ప్రాక్టికల్స్.
  • మార్చి 23 నుంచి ఇంటర్‌ వార్షిక పరీక్షలు.
  • మే చివరి వారంలో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు.
  • ఏప్రిల్ 14 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు.
  • జూన్ 1న ఇంటర్ కళాశాలలు పునఃప్రారంభం

ఇదీ చూడండి:

TRANSGENDER: ట్రాన్స్‌జెండర్ల రిజర్వేషన్​పై హైకోర్టులో విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.