Telangana local body MLC elections 2021: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో బరిలోకి దిగాలా వద్దా అనే విషయమై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తర్జన భర్జనల అనంతరం 2 చోట్ల అభ్యర్థులను బరిలోకి దింపాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.అందులో ప్రధానంగా నిర్మల, నాగేశ్వరరావు పేర్లను పీసీసీ అధిష్ఠానానికి పంపింది. మెదక్ నుంచి ఎమ్మెల్యే జగ్గారెడ్డి భార్య నిర్మల, ఖమ్మం నుంచి రాయల నాగేశ్వరరావు బరిలో దిగనున్నారు. మిగతా స్థానాల్లో ఆశించిన ఓట్లు లేవని డీసీసీ అధ్యక్షులు తేల్చారు.
telangana congress: రేపటితో నామినేషన్ల గడువు ముగియనుండడంతో ఇవాళ తుది నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. దిల్లీ నుంచి ప్రత్యేక దూత ద్వారా అధిష్ఠానం ఏ ఫారంలు పంపినట్లు సమాచారం. ఈమేరకు బీ ఫారంలు అందజేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సిద్ధం చేస్తున్నారు.
ఎన్నో చర్చల అనంతరం
దుబ్బాక, నాగార్జునసాగర్, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటముల ప్రభావం పార్టీపై పడిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓడిపోతే పార్టీ శ్రేణులు, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని సీనియర్ నాయకులు కొందరు ఇప్పటికే అభిప్రాయం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరగనున్న జిల్లాలకు చెందిన సీనియర్ నాయకులు, డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాలనూ సేకరించారు. నాలుగైదు రోజుల క్రితమే నిర్ణయం ప్రకటించాలని భావించినప్పటికీ.. ఎటూ తేల్చుకోలేక వాయిదా వేశారు. కొన్ని రోజుల క్రితం గాంధీభవన్లో సీనియర్ నేతల సమావేశమై ఆయా జిల్లాల్లోని స్థానిక సంస్థలో పార్టీకి ఉన్న బలాబలాలను విశ్లేషించారు.
ఇదీ చదవండి: AP MLC elections: ముగిసిన స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు