తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ సమయాలను పొడిగించడంతో రేపటి నుంచి బ్యాంకుల పని వేళలు మారనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని బ్యాంకులు పని చేస్తాయని ఎస్‌ఎల్‌బీసీ స్పష్టం చేసింది. ఇవాళ అత్యవసరంగా సమావేశమైన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ.. రాష్ట్రంలో బ్యాంకుల పని వేళలు, లాక్‌డౌన్ పొడిగింపుపై సమీక్షించింది.
బ్యాంకు పని వేళల్లోనూ మార్పు చేయాలని పలువురు కమిటీ సభ్యులు ఎస్‌ఎల్‌బీసీకి విజ్ఞప్తి చేశారు. దీంతో వారి వినతులను, సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకున్న ఎస్‌ఎల్‌బీసీ.. బ్యాంకు పని వేళలను మార్పు చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలోని బ్యాంకులు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు పని చేస్తున్నాయి. రేపటి నుంచి ఎస్‌ఎల్‌బీసీ నిర్ణయం మేరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఖాతాదారులకు సేవలు అందించాలని బ్యాంకర్లు నిర్ణయించారు.
ఇదీ చూడండి: Curfew: రాష్ట్రంలో జూన్ 10 వరకు కర్ఫ్యూ పొడిగింపు