ETV Bharat / city

మూడు రాజధానులతో ఏపీకి నష్టం: యనమల - తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు

మూడు రాజధానులతో ఏపీకి నష్టమేనని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణను ఎవరూ వ్యతిరేకించరన్న యనమల... పరిపాలన ఒకచోటే ఉండటం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విధానమని పేర్కొన్నారు. ఏపీలో ప్రగతి జరగకుండా విచ్ఛిన్నం చేయాలనేది జగన్‌ కుట్ర అని మండిపడ్డారు

tdp-yanamala-latest-comments-on-capital
tdp-yanamala-latest-comments-on-capital
author img

By

Published : Dec 18, 2019, 12:26 PM IST

మూడు రాజధానులతో ఏపీకి నష్టం: యనమల

మూడు రాజధానులతో రాష్ట్రానికి నష్టమే తప్ప... ఏ మాత్రం లాభం ఉండదని తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణను ఎవరూ వ్యతిరేకించరన్న ఆయన... ఏపీలో ప్రగతి జరగకుండా విచ్ఛిన్నం చేయాలనేది జగన్‌ కుట్రగా ఆయన అభివర్ణించారు. ఉద్యోగులు హైదరాబాద్ నుంచి అమరావతికి అతికష్టం మీద వచ్చారన్న యనమల....ఇప్పుడు మళ్లీ విశాఖ వెళ్లాలా అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక వనరులు ఇందుకు సహకరించవని తెలిపారు. ఇది ఖచ్చితంగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే చర్యేనన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.