జగన్ అన్ని రంగాల్లోనూ నెంబర్ 1 అంటూ తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొదటి స్థానంలో ఉండాల్సిన జగన్కు... విజయసాయి రెడ్డి మూడో స్థానం అంటూ ప్రచారం చేయడం బాధ కలిగించిందని అన్నారు.
ఏ1 అయిన జగన్ అవినీతిలో నెంబర్1. కరోనా వ్యాప్తిలో రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలబెట్టారు. భూ కుంభకోణాల్లో మొదటి స్థానంలో ఉన్నారు. ఇసుక దోపిడీ, ప్రజల్ని మోసం చేయడంలో నెంబర్ 1. ఎస్సీలపై దాడులు, మహిళలపై అత్యాచారాల్లోనూ ఏపీ నెంబర్ 1గా ఉంది.
- అయ్యన్నపాత్రుడు, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు
ఇన్ని రంగాల్లో జగన్ నెంబర్1గా ఉంటే నెంబర్3 అన్న తన వ్యాఖ్యలను విజయసాయి సరి చేసుకుంటే మంచిదని అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు.
ఇదీ చూడండి: