తెదేపా అనుబంధ విభాగమైన తెలుగు యువతకు సంబంధించిన.. నూతన పార్లమెంట్ స్థానాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను పార్టీ అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. ఆయా పేర్లను తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు ప్రకటించారు. తెలుగు యువత విభాగాన్ని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తామని చినబాబు తెలిపారు. జగన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు 2.30లక్షల ఉద్యోగాల కల్పనకు కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకటించే వరకూ మా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. యువతకు ఏ ఇబ్బంది వచ్చినా వారి పక్షాన తెలుగు యువత నిలబడుతుందన్నారు. ఇటీవలే 15పార్లమెంట్ స్థానాలకు తెలుగుయువత కార్యవర్గాన్ని ప్రకటించామన్న శ్రీరామ్ అసెంబ్లీ నియోజకవర్గాలకు త్వరలోనే ప్రకటిస్తామన్నారు. 2024లో చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేయటమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.
ప్రకటించిన తెలుగుయువత అధ్యక్ష, కార్యదర్శుల వివరాలు...
పార్లమెంట్ స్థానం | అధ్యక్షుడు | ప్రధాన కార్యదర్శి |
అరకు | సుమంత్ నాయుడు | నాగాంజి ప్రసాద్ |
శ్రీకాకుళం | దాసునాయుడు | ఏ.రామకృష్ణ |
నరసాపురం | పత్తిపాటి ధర్మేంద్ర | మీసాల రవికుమార్ |
ఏలూరు | రెడ్డి సూర్యచంద్రరావు | తాతా యశ్వంత్ రాజశేఖర్ |
గుంటూరు | ఆర్.సాయికృష్ణ | షేక్ నాగూల్ మీరా |
బాపట్ల | ఉప్పల సాంబశివరావు | కొల్లూరు నాగశ్రీధర్ |
కడప | గుత్తా యర్నాధరెడ్డి | విజయ్ కుమార్ రెడ్డి |
రాజంపేట | టీ.నవీన్ కుమార్ రెడ్డి | షేక్ అయూబ్ భాషా |
కర్నూలు | ఎస్. అబ్బాస్ | వెంకట దివాకర్ రెడ్డి |
తిరుపతి | రవినాయుడు | రామిరెడ్డి |
ఇదీ చదవండీ.. తెదేపా రాయలసీమ నాయకుల సమావేశం..