వైకాపా నాయకులు.. తమ విరుద్ధ ప్రవర్తనతో పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించారని... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. 3,4వ దశ పంచాయతీ ఎన్నికల్లో వైకాపాకు పరాజయం తప్పదని జోస్యం చెప్పారు. 92శాతం పంచాయతీల్లో తామే గెలిచామంటూ.. వైకాపా నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని... ఏం చేసినా వాస్తవం దాగదని అన్నారు. ఓట్లు వేయలేదని ఇల్లు, డ్రైనేజ్, మెట్లు పగలగొట్టటం, సంక్షేమ పథకాలు రద్దు చేయటం, దాడులు చేయటం దారుణమని పేర్కొన్నారు.
ఇదీ చదవండీ...పల్లా దీక్షను భగ్నం చేయడం దారుణం: లోకేశ్