ETV Bharat / city

కనకదుర్గ పైవంతెన ప్రారంభానికి కేంద్ర మంత్రికి ఎంపీ ఆహ్వానం - tdp mp kesineni nani invited nithin gadkari for flyover bridge inauguration news

తెదేపా ఎంపీ కేశినేని నాని కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీని కలిశారు. విజయవాడ పైవంతెన ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. విజయవాడ పైవంతెన నిర్మాణానికి 2014లో గడ్కరీ అనుమతి ఇచ్చారని ఎంపీ చెప్పారు. జగన్​ పాలనలో రాష్ట్రం వెనక్కు వెళ్లిందని విమర్శించారు. కోర్టు మొట్టికాయలు వేసినా.. ముఖ్యమంత్రి వైఖరిలో మార్పు రాలేదని అన్నారు.

కనకదుర్గ పైవంతెన ప్రారంభానికి కేంద్ర మంత్రికి ఎంపీ ఆహ్వానం

author img

By

Published : Aug 15, 2020, 4:24 PM IST

విజయవాడకు కనకదుర్గ పైవంతెన ఒక మణిహారంగా ఉండబోతోందని ఎంపీ కేశినేని నాని అన్నారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసిన ఆయన.. పైవంతెన ప్రారంభోత్సవానికి ఆహ్వానించినట్లు చెప్పారు. వైసీపీ నేతలు సాధ్యం కాదన్న పనిని చేసి చూపిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని అన్నారు. సీఎం జగన్‌ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతుందన్నారు.

అభివృద్ధిలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కు వెళ్లిందని ఎంపీ విమర్శించారు. జగన్​ సీఎం అయ్యాక కోర్టు 60సార్లు మొట్టికాయలు వేసిందని.. అయినా ఆయన నైజంలో మార్పు రాలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉందని కేశినేని పేర్కొన్నారు.

ఇదీ చూడండి..

విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధి పెంపు దిశగా ప్రభుత్వం ఆలోచన

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.