గులాబ్ తుపాన్ వల్ల ఉత్తరాంధ్రలో తీవ్ర నష్టం వాటిల్లితే ముఖ్యమంత్రి పట్టించుకోలేదని తెదేపా సీనియర్ నేత నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. తమకున్న ప్రాథమిక అంచనా ప్రకారం ఒక్క శ్రీకాకుళంలోనే 20వేల ఎకరాల వరి, 14వేల ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నాయని తెలిపారు. విజయనగరంలో 22వేల ఎకరాల వరి, 13వేల ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. విశాఖలో 4వేల ఎకరాల వరి దెబ్బతినగా.. ప.గో జిల్లాలో 16వేల ఎకరాల్లో పంట నీట మునిగిందని చెప్పారు.
ఒడిశా సీఎం అక్కడి ప్రజల్ని ఆదుకునేందుకు చర్యలు చేపడితే.. జగన్ రెడ్డి 20నిమిషాల సమీక్షతో సరిపెట్టారని దుయ్యబట్టారు. నష్టపోయిన పంటలకు ఎకరాకు 30వేల పరిహారం చెల్లించాలని.. పునరావాస బాధితులకు 5 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ వ్యవస్థను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలన్నారు.
ఇదీ చదవండి: Dhawaleswaram dam : ధవళేశ్వరం ఆనకట్టపై గుంతలు పూడ్చిన అధికారులు...