ముఖ్యమంత్రి జగన్ విధానాల వల్ల పేద ప్రజలు బలవుతున్నారని తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. ప్రజలు శానిటైజర్లు తాగి చనిపోవటానికి ప్రభుత్వమే కారణమన్నారు. మద్యపానం నిషేధం పేరిట ధరలు పెంచటం సరైన నిర్ణయం కాదన్నారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం విధించాలని లేదా పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ధరల ఆధారంగా రాష్ట్రంలో అమ్మకాలు జరపాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో శానిటైజర్ తాగి చనిపోయిన మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని మాజీమంత్రి జవహర్ ధ్వజమెత్తారు. పెరిగిన మద్యం ధరల కారణంగా పేదలు తమ రోజు కూలీ మొత్తం మద్యానికే ఖర్చు చేస్తూ కుటుంబాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా శానిటైజర్, నాటుసారా తాగి.. 50మంది చనిపోయారని విమర్శించారు. వీటన్నింటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ.. భారత్ బంద్కు తెదేపా మద్దతు: అచ్చెన్నాయుడు