సొమ్మొకడిది, సోకొకడిదిలా ఉంది జగన్ రెడ్డి వైఖరి అని శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. మత్స్యకారులకు పరిహారాన్ని 6 నెలలుగా తొక్కిపెట్టింది జగన్ కాదా అని నిలదీశారు. ముమ్మడివరం నియోజకవర్గం మురుముళ్లలో సీఎం జగన్ రెడ్డి మాయ మాటలు.. నమ్మే పరిస్థితి లేదని అన్నారు. ఓఎన్జీసీ పైపులైన్లతో నష్టపోయిన మత్స్యకారులకు పరిహారం పరిహారమిచ్చేది కేంద్రమన్న యనమల... అదేదో తానే సొంత జేబులో నుంచి ఇస్తున్నట్లు జగన్ ఫోజులు కొట్టడం హాస్యాస్పదమన్నారు.మత్స్యకారులకు పరిహారం ఇవ్వకుండా తొక్కిపెట్టడం జగన్మోసం కాదా? అని ప్రశ్నించారు.
మల్లాడి సత్యలింగ నాయకర్ పేరెత్తే అర్హత జగన్‌కు ఉందా అని యనమల నిలదీశారు. ఎంఎస్ఎన్ ట్రస్ట్ ఆస్తులు కూడా కబ్జా చేయాలని చూడలేదా అంటూ దుయ్యబట్టారు. ఎన్నాళ్లని ప్రతిపక్షాలను ఆడిపోసుకుంటారని మండిపడ్డారు. మూడేళ్లలో ఏం చేశారో చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా అని ప్రశ్నించారు. జగన్ దోపిడీ సొమ్ము ప్రభుత్వ ఖజనాకు జమచేస్తే ఇంత ఆర్థిక సంక్షోభం ఉండేదా అని యనమల రామకృష్టుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకుండా.. లాంతర్లు పంచుతారా.. అప్పులు చేసి, జగన్‌నే నమ్మి ఇళ్లు కట్టుకున్నవారందరూ చీకట్లలో మగ్గాల్సిందేనని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం వ్యాఖ్యానించారు. జగనన్న కాలనీల పేరుతో ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న నివాసాలకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడానికి రూ.4,500 కోట్లు ఖర్చవుతుందన్న ఆయన... తాను మాత్రం రూపాయి ఇవ్వనని జగన్ రెడ్డి ఖరాకండిగా తేల్చేశారని విమర్శించారు. విద్యుత్ సౌకర్యం కల్పించకుండా.. ముఖ్యమంత్రి కాలనీల్లో ఉండేవారికి లాంతర్లు పంచుతారా అంటూ ఎద్దేవాచేశారు. కాగితాలు చూసి చదువుతే కానీ ఉపన్యాసం ఇవ్వలేని దౌర్భాగ్య స్థితి జగన్ రెడ్డిదని దుయ్యబట్టారు. అసహనంతో ఉన్న ముఖ్యమంత్రి నోటివెంట పదాలు కూడా సరిగా రావట్లేదన్నారు.
ఇదీ చదవండి:"కాంబాబు ఎవరో జగనే చెప్తారు.." అయ్యన్నపాత్రుడు మరో ట్వీట్!