సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు మండలి ఛైర్మన్ తీసుకున్న నిర్ణయమే అంతిమమని.. అది ఎవరూ ప్రశ్నించలేనిదని శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు తేల్చి చెప్పారు. మెజారిటీ సభ్యుల అభిప్రాయాలు, సభ మూడ్ ప్రకారమే కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకుంటారని వివరించారు. సభలో పరిస్థితులకు అనుగుణంగా రూలింగ్ ఇచ్చే అధికారం ఛైర్మన్‌కు ఉంటుందని చెప్పారు. ఓ కార్యదర్శి.. మండలి ఛైర్మన్ నిర్ణయాన్ని ఎలా ప్రశ్నిస్తారని ఆక్షేపించారు. చంద్రబాబుతో పాటు తెదేపా నాయకులకు భద్రత కుదింపు అప్రజాస్వామికమన్న యనమల.. అధికార పార్టీ నేతలు ఇష్టానుసారం వ్యవహరించటం తగదని అన్నారు.
ఇదీ చదవండి: