శ్రీకాకుళం జిల్లాలో ఇసుక దొరకాలంటే ఏపీఎండీసీ వెబ్సైట్లో కాకుండా తమ్మినేని సీతారాం డాట్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని తెదేపా నేత కూన రవికుమార్ ఆరోపించారు. మంత్రి అనిల్ కుమార్ నోటి పారుదల ఆపి... నీటి పారుదలపై దృష్టి సారించాలన్నారు. అనిల్ కుమార్ యాదవ్ నీటి పారుదలశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ప్రాజెక్టులకు గ్రహణం పట్టిందని విమర్శించారు.
ఆయన మంత్రి అయ్యాకే నీటి మాఫియా మొదలైందన్నారు. సోమశిల ప్రాజెక్టులో 10 వేల క్యూసెక్కుల నీటిని అమ్ముకున్నారని వైకాపా నేతలే విమర్శించారని గుర్తుచేశారు. ఏ అర్హతతో లోకేశ్‌పై విమర్శలు చేస్తారని నిలదీశారు. నెల్లూరు పోలీసు స్టేషన్‌లోని రికార్డులు తీస్తే అనిల్ నేరచరిత్రను చెబుతాయని అన్నారు. బెట్టింగ్ వ్యవహారాలు మర్చిపోయారా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఉచితంగా ఇచ్చిన ఇసుకను అమ్ముకుంటూ దోపిడికి పాల్పడుతున్న వైకాపా నేతలు తెదేపాపై నిందలు వేస్తున్నారన్నారు.
ఇదీ చదవండి:
ప్రత్యేక పరిస్థితుల్లో... అసెంబ్లీ సమావేశాలు: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి