ప్రమాదకర మత్తు పదార్థాలు , మాదకద్రవ్యాలు దిగుమతి చేసుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం పోర్టులను అరబిందో, అదానీలకు కట్టబెట్టారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. తోలుబొమ్మలా ఆడే డీజీపీని అడ్డంపెట్టుకుని పట్టుబడిన హెరాయిన్‌కు, రాష్ట్రానికి సంబంధం లేదని తప్పుడు ప్రకటనలు ఇప్పించారని దుయ్యబట్టారు. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌సిబి)ని కాస్తా సేల్స్ ఎంకరేజ్‌మెంట్ బ్యూరోగా మార్చేసిన జగన్‌మోహన్‌రెడ్డి మద్యం మాఫియా ద్వారా రాష్ట్రాన్ని డ్రగ్ ఆంధ్రప్రదేశ్‌గానూ, మాదక ద్రవ్యాలకు చిరునామాగా మార్చేశారని ఆక్షేపించారు. ప్రతిఏటా మద్యం అమ్మకాలు పెరుగుతుంటే గణనీయంగా తగ్గాయని ముఖ్యమంత్రి సమీక్షలు పెట్టి ప్రకటనలు ఎలా ఇస్తారని పట్టాభి ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇదీ చదవండీ..childrens montessori high school close: విజయవాడలోని మాంటిస్సోరీ ఉన్నత పాఠశాల మూసివేత