వెనుకబడిన వర్గాలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. రాజకీయ హామీల అమలుకు కార్పొరేషన్ల నిధులను దారి మళ్లించారని ఆక్షేపించారు. ప్రస్తుతం ప్రభుత్వాన్ని విజయసాయి, సజ్జల నడిపిస్తున్నారని మండిపడ్డారు. బలహీన వర్గాల అభ్యున్నతికి ఏడాదిలో ఎంత ఖర్చు చేశారో చెప్పాలని కాల్వ డిమాండ్ చేశారు.
డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుండా మోసం చేశారన్న ఆయన.. బీసీలను రాజకీయ నాయకత్వానికి దూరం చేశారని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ సలహాదారుల్లో ఎంత మంది బీసీలున్నారో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం ఒక చేత్తో సంక్షేమాన్ని చేసినట్టే చేసి.. మరో చేత్తో ప్రజల నుంచి డబ్బు లాగేస్తోందని విమర్శించారు.
ఇదీ చూడండి: