Bonda Uma: ప్రజలపై పన్నుల భారం వేసేందుకే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారని తెలుగుదేశం విమర్శించింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు భూముల విలువ పెంచారని తెదేపా నేత బొండా ఉమ అన్నారు. భూముల విలువ పెంపు మరో బాదుడే బాదుడు కార్యక్రమమని విమర్శించారు. భూములు విలువ పెరిగినప్పుడల్లా ఇంటి పన్ను పెరిగేలా చట్టం తెచ్చారన్న ఆయన... ఇప్పుడు మళ్లీ 15 శాతం పన్నుల భారం ప్రజలపై పడనుందని ఆరోపించారు.
ఆరు నెలల్లో 30 శాతం ఇంటిపన్ను పెంచడం దుర్మార్గమని దుయ్యబట్టారు. వైకాపా రాజకీయ ప్రయోజనాల కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నేతల స్థిరాస్తి వ్యాపారం కోసమే భూముల విలువ పెంచారన్నారు. సీఎం జగన్ దిల్లీ పర్యటన.. స్వప్రయోజనాల కోసమేనని తెదేపా నేత బొండా ఉమ ఆరోపించారు.
ఇదీ చదవండి: కల్లూరు పీఎస్ వద్ద ఉద్రిక్తత.. తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్