ప్రభుత్వంలో ఐదుగురు బలహీన వర్గాలకు చెందిన మంత్రులున్నా ఉపయోగం ఏముందని మాజీమంత్రి జవహర్ విమర్శించారు. హోంమంత్రికి షాడో హోం మంత్రి ఉన్నట్లే, మిగిలిన మంత్రులకు కూడా రెడ్డి వర్గీయులు షాడోలుగా ఉన్నారన్నారు. కేవలం ఐదారుగురికి పదవులిచ్చినంత మాత్రాన జగన్ బలహీన వర్గాల ద్రోహి కాకుండా పోతాడా అంటూ ఆరోపించారు. బలహీన వర్గాల ద్రోహి ఎవరో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్న అయన.. వైకాపా నుంచి ఎవరొస్తారో రావాలని సవాల్ విసిరారు. జగన్ ప్రభుత్వంలో బలహీన వర్గాలకు రక్షణ ఉందని ఆ వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, మంత్రులు చెప్పగలరా అని నిలదీశారు. బలహీన వర్గాలపై దాడులు జరుగుతుంటే మౌనంగా ఉంటున్న జగన్మోహన్ రెడ్డి నిజమైన ద్రోహి అని మండిపడ్డారు.
వైకాపా అధికారంలోకి వచ్చాక బలహీనవర్గాలపై 137 దారుణాలు జరిగాయని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ఆరోపించారు. అవేవీ తమ ప్రభుత్వంలో జరగలేదని అంబటి రాంబాబు చెప్పగలరా అంటూ నిలదీశారు. వయస్సు పెరిగినా సిగ్గు, ఆలోచన లేకుండా అంబటి మాట్లాడితే ప్రజలు నమ్ముతారా అంటూ ప్రశ్నించారు. జగన్కు ఏనాడైనా అంబటి మంచి సలహాలు ఇచ్చారా అని అన్నారు. చెప్పేది నీతివాక్యాలు .. చేసేది దుర్మార్గాలు ఇదేగా వైకాపా నేతలు చేస్తున్నదని మాణిక్యరావు విమర్శించారు.
ఇదీ చదవండి: హద్దు మీరిన చైనా- గట్టిగా బదులిచ్చిన భారత్