ETV Bharat / city

Chandrababu: "వైద్యరంగంపై సీఎం జగన్​ తప్పుడు ప్రకటనలు మానుకోవాలి" - ఏపీ తాజా వార్తలు

TDP chief Chandrababu: వైద్యరంగంపై తప్పుడు ప్రకటనలు చేయడం సీఎం జగన్​ మానుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు హితవు పలికారు. సీఎం తొలుత ఎయిమ్స్‌లో నీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. మా హయాంలో ఎయిమ్స్‌కు భూమి కేటాయించి, వసతులు కల్పించాలన్నారు. ఎయిమ్స్ కోసం వైకాపా ప్రభుత్వం ఏం చేసిందో చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఎయిమ్స్‌లో వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించాలని చంద్రబాబు సూచించారు.

TDP chief Chandrababu
చంద్రబాబు
author img

By

Published : Sep 26, 2022, 6:55 PM IST

TDP chief Chandrababu: వైద్య రంగంపై సీఎం జగన్ తప్పుడు ప్రకటనలు మాని.. ముందు ఎయిమ్స్ నీటి సమస్యను పరిష్కరించాలని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మంగళగిరి ఎయిమ్స్​కు కనీసం నీటి సరఫరా చేయలేని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలంటూ మండిపడ్డారు. అతి తక్కువ ధరలో పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించే ఆసుపత్రికి నీళ్లివ్వలేనందుకు ప్రభుత్వం సిగ్గు పడాలన్నారు. అసలు వైకాపా ప్రభుత్వం ఈ మూడున్నరేళ్ల కాలంలో ఎయిమ్స్ కోసం ఏం చేసిందో చెప్పగలదా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో వైద్య కళాశాలలన్నీ తామే తెచ్చామని అసెంబ్లీలో అబద్దాలు చెప్పిన ముఖ్యమంత్రి... తానుంటున్న మునిసిపాలిటీ నుంచి ఆసుపత్రికి నీళ్లెందుకు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు. స్వయంగా కేంద్ర మంత్రులు సైతం నీటి వసతిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినా స్పందించని ఈ ముఖ్యమంత్రి... వైద్య రంగంలో సమూల మార్పులు తన వల్లే అని అబద్దాలు చెబుతున్నారని చంద్రబాబు విమర్శించారు.

"రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మంగళగిరి ఎయిమ్స్ (AIIMS)కు కనీసం నీటి సరఫరా చేయలేని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి?. అతి తక్కువ ధరలో పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించే ఆసుపత్రికి నీళ్లివ్వలేనందుకు ప్రభుత్వం సిగ్గు పడాలి. అసలు వైకాపా ప్రభుత్వం... ఈ మూడున్నరేళ్ల కాలంలో ఎయిమ్స్ కోసం ఏం చేసిందో చెప్పగలదా?. నాడు తెలుగుదేశం హయాంలో ఎయిమ్స్​కు భూములు ఇచ్చి, వసతులు కల్పించి వైద్య సేవలకు ఈ ప్రతిష్ఠాత్మక సంస్థను సిద్దం చేశాం. అటువంటి సంస్థ పెరిగిన తమ అవసరాల కోసం అదనంగా నీటి వనరులను సమాకూర్చాలని లేఖలు రాసినా పరిష్కరించకపోవడం ఈ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు అన్నీ తామే తెచ్చామని అసెంబ్లీలో సైతం అసత్యాలు చెప్పుకొన్న ముఖ్యమంత్రి... తానుంటున్న మున్సిపాలిటీ నుంచి ఆసుపత్రికి నీళ్లెందుకు ఇవ్వలేకపోతున్నారు?. స్వయంగా కేంద్ర మంత్రులు సైతం నీటి వసతిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినా స్పందించని ఈ ముఖ్యమంత్రి... వైద్య రంగంలో సమూల మార్పులు తన వల్లే అని బొంకుతున్నాడు. మీ చేతగానితనం లక్షల మంది ప్రజలకు శాపంగా మారకూడదు. ప్రభుత్వం వెంటనే ఎయిమ్స్​కు అవసరమైన అన్ని అదనపు మౌలిక సదుపాయాలు కల్పించాలి." -చంద్రబాబు

  • రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మంగళగిరి ఎయిమ్స్ (AIIMS) కు కనీసం నీటి సరఫరా చెయ్యలేని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? అతి తక్కువ ధరలో పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించే ఆసుపత్రికి నీళ్లివ్వలేనందుకు ప్రభుత్వం సిగ్గు పడాలి.(1/5) pic.twitter.com/KQWYS13EeW

    — N Chandrababu Naidu (@ncbn) September 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • అటువంటి సంస్థ పెరిగిన తమ అవసరాల కోసం అదనంగా నీటి వనరులను సమాకూర్చాలని లేఖలు రాసినా పరిష్కరించకపోవడం ఈ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం. రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ లు అన్నీ తామే తెచ్చామని అసెంబ్లీలో సైతం అసత్యాలు చెప్పుకున్న ముఖ్యమంత్రి...(3/5)

  • మీ చేతగానితనం లక్షల మంది ప్రజలకు శాపంగా మారకూడదు. ప్రభుత్వం వెంటనే ఎయిమ్స్ కు అవసరమైన అన్ని అదనపు మౌలిక సదుపాయాలు కల్పించాలి.(5/5)

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.