TDP chief chandrababu: సమసమాజ స్థాపనకు, విద్యావ్యాప్తికి, మహిళా సాధికారతకు తన జీవితం అంకితం చేసిన తొలి సమాజ సంస్కర్త మహాత్మ జ్యోతిబా ఫూలే అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఫూలే వంటి మహనీయుల ఆశయ స్ఫూర్తితో స్థాపించిన పార్టీ తెదేపా అని పేర్కొన్నారు. వెనకబడిన వర్గాల్లో రాజకీయ చైతన్యం కలిగించి... వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ పురోగతికి 40 ఏళ్లుగా కృషి చేస్తోందని వెల్లడించారు. బీసీలది, తెలుగుదేశం పార్టీది విడదీయలేని అనుబంధమని స్పష్టం చేశారు. తెలుగుదేశం డీఎన్ఏలోనే బీసీల అభివృద్ధి ఇమిడి ఉందని తెలిపారు. తెదేపా అంటేనే బీసీల పార్టీ అనే వాస్తవం ఎవరూ కాదనలేనిదన్నారు.
TDP chief chandrababu: రాష్ట్రం, దేశంలో అన్ని రాజకీయ పార్టీలు నేడు బీసీల గురించి మాట్లాడాల్సిన పరిస్థితి కల్పించిందే తెదేపా అని అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను 26 ఏళ్ల పాటు అమల్లో ఉన్నాయంటే దానికి కారణం తమ పార్టీనే అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తితిదే చైర్మన్ పదవితో పాటు...16 వర్శిటీల్లో 9 వర్శిటీలకు వీసీలుగా బీసీలను నియమించామని గుర్తు చేశారు. ఆదరణ పథకంతో చేతి వృత్తిదారులకు ఉపాధి కల్పించారని చెప్పారు. జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు.
-
సమసమాజ స్థాపనకు, విద్యావ్యాప్తికి, మహిళా సాధికారతకు తన జీవితం అంకితం చేసిన తొలి సమాజ సంస్కర్త మహాత్మ జ్యోతిబా ఫూలే.ఫూలే వంటి మహనీయుల ఆశయ స్ఫూర్తితో స్థాపించిన టిడిపి...వెనకబడిన వర్గాలలో రాజకీయ చైతన్యం కలిగించి, వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ పురోగతికి 40 ఏళ్లుగా కృషిచేస్తోంది.(1/4) pic.twitter.com/KDxi5ZI826
— N Chandrababu Naidu (@ncbn) April 11, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">సమసమాజ స్థాపనకు, విద్యావ్యాప్తికి, మహిళా సాధికారతకు తన జీవితం అంకితం చేసిన తొలి సమాజ సంస్కర్త మహాత్మ జ్యోతిబా ఫూలే.ఫూలే వంటి మహనీయుల ఆశయ స్ఫూర్తితో స్థాపించిన టిడిపి...వెనకబడిన వర్గాలలో రాజకీయ చైతన్యం కలిగించి, వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ పురోగతికి 40 ఏళ్లుగా కృషిచేస్తోంది.(1/4) pic.twitter.com/KDxi5ZI826
— N Chandrababu Naidu (@ncbn) April 11, 2022సమసమాజ స్థాపనకు, విద్యావ్యాప్తికి, మహిళా సాధికారతకు తన జీవితం అంకితం చేసిన తొలి సమాజ సంస్కర్త మహాత్మ జ్యోతిబా ఫూలే.ఫూలే వంటి మహనీయుల ఆశయ స్ఫూర్తితో స్థాపించిన టిడిపి...వెనకబడిన వర్గాలలో రాజకీయ చైతన్యం కలిగించి, వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ పురోగతికి 40 ఏళ్లుగా కృషిచేస్తోంది.(1/4) pic.twitter.com/KDxi5ZI826
— N Chandrababu Naidu (@ncbn) April 11, 2022