ETV Bharat / city

TDP on DGP Office కుప్పం ఘటనపై తెదేపా నిరసన, డీజీపీ ఆఫీస్​ ముట్టడి - కుప్పం ఘటనకు నిరసనగా తెదేపా డీజీపీ ఆఫీస్​ ముట్టడి

TDP on DGP Office కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకున్నందుకు నిరసనగా అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భవన్ నుంచి డీజీపీ కార్యాలయం వరకు తెదేపా నేతలు ర్యాలీ నిర్వహించారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం వద్ద తెదేపా శ్రేణుల ఆందోళనకు దిగారు. డీజీపీ కార్యాలయం గేటు దూకేందుకు తెదేపా శ్రేణుల యత్నించారు. డీజీపీ కార్యాలయం వద్ద తెదేపా నేతల వినతిపత్రాన్ని పోలీసులు తీసుకున్నారు.

TDP on DGP Office
డీజీపీ ఆఫీస్​ను ముట్టడించిన తెదేపా
author img

By

Published : Aug 25, 2022, 2:08 PM IST

Updated : Aug 25, 2022, 2:24 PM IST

TDP on DGP Office మంగళగిరిలో తెదేపా శ్రేణులు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రధాన ద్వారాన్ని తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నల్లజెండాలు, తెదేపా జెండాలతో గేటు వద్దే అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నుంచి డీజీపీ కార్యాలయానికి అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. కుప్పంలో చంద్రబాబుని అడ్డుకునే యత్నం, అన్న క్యాంటీన్​పై దాడిని నిరసిస్తూ అచ్చెన్నాయుడు.. డీజీపీ కార్యాలయానికి కాలినడకన వెళ్లారు. అచ్చెన్నాయుడు వెంట పీతల సుజాత, ఎం.ఎస్. రాజు, తెనాలి శ్రావణ్ కుమార్, నాదెండ్ల బ్రహ్మం, ఇతర తెదేపా నేతలు నిరసనగా బయలుదేరారు. డీజీపీ కార్యాలయం గేటు ఎక్కి దూకేందుకు తెదేపా శ్రేణులు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Aug 25, 2022, 2:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.