కోవిడ్ 19 లక్షణాలు చాలావరకు చిన్నారులు, యువతలో కనిపించటంలేదు. మధ్యవయస్కుల్లో మాత్రం కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో అనుమానిత లక్షణాలు ఉన్నవారు, లేనివారి వివరాలను వయస్సుల వారీగా విశ్లేషించారు. మొత్తం కేసుల్లో లక్షణాలున్న తొమ్మిదేళ్ల లోపు చిన్నారులు 0.37% ఉండగా, లక్షణాలు లేనివారు 3.27% ఉన్నారు. 29 ఏళ్లలోపు యువత విషయంలోనూ ఇదే ధోరణి కనిపించింది. 30-59 ఏళ్ల మధ్యవారిలో వైరస్ అనుమానిత లక్షణాలు కనిపించాయి. 60, ఆపై వయస్సు ఉన్నవారి మధ్య వ్యత్యాసం స్వల్పంగా ఉంది. పాజిటివ్ వచ్చిన వారిలో పురుషులు 66.6%, మహిళలు 33.4% ఉన్నారు.
మరణాలు ఇలా..
రాష్ట్రవ్యాప్తంగా వైరస్ బారిన పడి మరణించిన వారు (ఈనెల 26 ఉదయం వరకు) 31 మంది ఉన్నారు. వీరిలో 51-55 ఏళ్ల మధ్య వారు 9 మంది. 71 సంవత్సరాల పైబడిన వారు ఆరుగురు. 45 ఏళ్లలోపు ప్రాణాలు విడిచిన వారు ఇద్దరే. ఇతర అనారోగ్యాలతో పాటు ఆసుపత్రులకు ఆలస్యంగా రావడం వంటి కారణాల వల్ల ప్రాణనష్టం జరిగినట్లు వైద్యులు తెలిపారు. శ్వాసకోశ సమస్యలతో ఎక్కువమంది ప్రాణాలు వదిలారని తెలిపారు.
ఇది చదవండి 'రోగ నిరోధక శక్తి అతి స్పందనను కట్టడి చేస్తే మరణాలు తగ్గుతాయ్'