ETV Bharat / city

ఎల్జీ కేసులో హైకోర్టు ఆదేశాలపై స్టేకు సుప్రీం నిరాకరణ - సుప్రీంలో ఎల్జీ పాలిమర్స్ న్యూస్ లేటెస్ట్

విశాఖ ఎల్‌జీ పాలిమర్స్​ విషయంలో హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. వచ్చే వారం చివరి నాటికి విచారణలు ముగించాలని సూచిస్తామన్న సుప్రీంకోర్టు... ఎన్జీటీ ఆదేశాలతో డిపాజిట్ చేసిన రూ.50 కోట్ల పంపిణీని ఆపాలని మధ్యంతర ఆదేశాలు జారీచేసింది.

supreme court on lg polymers issue latest
సుప్రీం కోర్టు
author img

By

Published : Jun 15, 2020, 12:38 PM IST

హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ సుప్రీంలో ఎల్జీ పాలిమర్స్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ జరిగిన విచారణలో హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. పెండింగ్‌ పిటిషన్ల విచారణ వచ్చే వారం చివరకు ముగించాలని హైకోర్టుకు సూచిస్తామని పేర్కొంది.

సుమోటోగా కేసు తీసుకునే అధికారం ఉందని ఇప్పటికే ఎన్జీటీ స్పష్టం చేసిందని సుప్రీం వ్యాఖ్యానించింది. ఎన్జీటీ ఆదేశాల్లో డిపాజిట్ చేసిన 50 కోట్ల రూపాయల పంపిణీని 10 రోజులు ఆపాలని సుప్రీం మధ్యంతర ఆదేశాన్నిచ్చింది.

ఎన్జీటీ ఆదేశాలను సవాల్‌ చేస్తూ అప్లికేషన్‌ సమర్పించాలని పిటిషనర్‌కు సూచించింది. ఎల్జీ పాలిమర్స్‌ తరఫున వాదించిన సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ ప్లాంటును సీల్‌ చేయాలన్న హైకోర్టు ఆదేశాలు సరికావన్నారు. అది రాజ్యాంగ విరుద్ధమని వాదించగా అలా భావించట్లేదని జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ స్పష్టం చేశారు. ఈ సమయంలో ఈ విషయంలో జోక్యంచేసుకోవాలనుకోవట్లేదన్న సుప్రీంకోర్టు.... తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.

ఇవీ చూడండి-'స్టైరీన్ గ్యాస్​ కంటే తాగునీరే ప్రమాదకరంగా ఉంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.