కరోనా సమయంలో మార్చి, ఏప్రిల్ నెలలో ఏపీ ఉద్యోగుల జీతాల చెల్లింపు అంశంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. హై కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఈ పిటిషన్పై.. జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ చేపట్టింది.
50 శాతం జీతాలు చెల్లించేలా ప్రభుత్వం ఇచ్చిన జీవోలను హైకోర్టు కొట్టివేసింది. ఉద్యోగులు, పింఛనర్ల బకాయిలకు 12 శాతం వడ్డీతో చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేసింది. రెండు నెలల్లోనే బకాయిలు చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం సవాలు చేసింది. వాదనలు విన్న సుప్రీం.. కేసు విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: