మే 10 నుంచి జూన్ 11 వరకు హైకోర్టుకు సెలవులు ఉండనున్నాయి. గతంలో మే 14 నుంచి జూన్ 11 వరకు హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. మరోవైపు అక్టోబర్ 23తో పాటు గతంలో సెలవులు ప్రకటించిన నవంబర్ 3, 5 తేదీల్లో హైకోర్టు పనిదినంగా పేర్కొన్నారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. దిగువ న్యాయస్థానాల్లోని అన్ని జిల్లా కోర్టులు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులకు గతంలో మే 14 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. తాజాగా మే 10 నుంచి జూన్ 8 వరకు సెలవులుగా పేర్కొన్నారు. గతంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టులకు మే 21 నుంచి జూన్ 11 వరకు సెలవులు ప్రకటించగా.. తాజా నిర్ణయం ప్రకారం మే 17 నుంచి జూన్ 8 వరకు సెలవులు ఇచ్చారు.
ఇదీ చదవండి: ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా పాజిటివ్