రాష్ట్ర హైకోర్టు పరిధిలో పనిచేస్తున్న జిల్లా సెషన్సు కోర్టులకు ఆదివారం నుంచి జూన్ 12వ తేదీ వరకు వేసవి సెలవులు మంజూరయ్యాయి. జిల్లా న్యాయమూర్తులను రెండు విడతలుగా విభజించి ఐదురోజుల చొప్పున సెలవులు మంజూరు చేశారు. మొదటి విడత జూన్ 1వ తేదీ నుంచి 5వరకు, రెండో విడత జూన్ 7 నుంచి 11వరకు విభజించారు. న్యాయస్థానాల్లో నేరుగా కేసులను తీసుకోవటం లేదు. హైకోర్టు వెబ్‌సైట్ నుంచి ఈఫైలింగ్ ద్వారా కేసులు దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. అత్యవసర సివిల్ కేసులు విచారణ నిమిత్తం వెకేషన్సు కోర్టు నడుస్తుంది. జూనియర్ సివిల్ జడ్జిలకు వచ్చే నెల 8 నుంచి 12వరకు వేసవి సెలవులు మంజూరు చేశారు.
ఇదీ చదవండి: