ETV Bharat / city

జాబ్ క్యాలెండర్‌ను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాల నిరసన

author img

By

Published : Jun 29, 2021, 7:53 PM IST

కొత్త జాబ్ క్యాలెండర్‌ విడుదల చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు డిమాండ్​ చేస్తున్నాయి. జాబ్ క్యాలెండర్‌ను వ్యతిరేకిస్తూ పలు చోట్ల విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన నిర్వహించారు. ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై రాష్ట్ర కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోవాలని... కొత్త క్యాలెండర్ రాకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.

Student unions protest
Student unions protest

జాబుల్లేని జాబ్ క్యాలెండర్‌ను రద్దు చేసి కొత్తది విడుదల చేయాలన్న డిమాండ్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. విజయవాడలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. భాజపా అనుబంధ విద్యార్థి సంఘాలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కొత్త క్యాలెండర్‌పై నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహంకాళి సుబ్బారావు ఏఐఎస్​ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు, ఎస్​ఎఫ్​ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రవణ్ పాల్గొన్నారు.

ఈ నెల 18 న జగన్ సర్కార్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ లోపభూయిష్టంగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేస్తూ నూతన జాబ్ క్యాలెండరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్​లో గ్రూప్ 1,2 లకు సంబంధించిన 36 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించడం దారుణమని వాపోయారు. ఆయా శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం తోపాటు మెగా డీఎస్సీ, పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం రీనోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు.

అనంతపురంలో నిరుద్యోగ వేదిక ఆధ్వర్యంలో ఛలో కలెక్టరేట్ నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల నుంచి సప్తగిరి సర్కిల్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌ మోసం చేసేలా ఉందని మండిపడ్డారు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన నిరుద్యోగ వేదిక నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈడ్చుకెళ్లి పోలీసు వాహనాల్లో ఎక్కించి, అక్కడి నుంచి తరలించారు. పోలీసులతో ఉద్యమాల్ని అణిచివేయడం అసాధ్యమన్న నిరుద్యోగులు.... ప్రభుత్వం దిగిరాకుంటే సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఏబీవీపీ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తున్న నిరుద్యోగులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. జాబ్ క్యాలెండర్​ను రీ కాల్ చేయాలంటూ విద్యార్థి సంఘాల నేతలు తహసీల్దార్​కు వినతిపత్రం అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట విద్యార్ధి సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. తెదేపా యువనాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రేపు జరగబోయే కేబినెట్ సమావేశంలో కొత్త జాబ్ క్యాలెండర్ పై నిర్ణయం తీసుకోవాలని.. లేని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

కడప ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట చెప్పులు కుడుతూ, బూట్ పాలిష్ చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులు నిరసన తెలిపారు. రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 10 వేల ఉద్యోగాల జాబితాను విడుదల చేయడం దారుణమన్నారు. బూటకపు ఉద్యోగ క్యాలెండర్​ ను రద్దు చేసి... కొత్తది విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. ముఖ్యమంత్రి జగన్ నిరుద్యోగులను మోసం చేశారంటూ టీఎన్​ఎస్​ఎఫ్​ నేతలు ఆరోపించారు. ఇందుకు సీఎంపై చర్యలు తీసుకోవాలంటూ మంగళగిరి పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి: 'కొత్త జాబ్​ క్యాలెండర్​ విడుదల చేయకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.