తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిదేడు గ్రామానికి… ఆర్టీసీ బస్సు సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. పాఠశాల సమయంలో బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణకు విద్యార్థిని వైష్ణవి లేఖ రాసింది. కొవిడ్ కారణంగా తమ గ్రామానికి ఆర్టీసీ బస్సు రాకపోకలు నిలిచిపోయాయని… ఫలితంగా బడికి వెళ్లేందుకు ఇబ్బంది అవుతోందని ఆ విద్యార్థిని లేఖలో తెలిపింది.
ఆర్థిక ఇబ్బందులతో ప్రైవేటు వాహనాలలో పాఠశాలకు వెళ్లడం కష్టంగా ఉందని వైష్ణవి లేఖలో పేర్కొంది. లేఖపై స్పందించిన సీజేఐ జస్టిస్ రమణ..చిన్నారి ఆవేదనను పరిష్కరించమని కోరుతూ..టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు లేఖను పంపించారు. తక్షణం స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. ఆ గ్రామానికి బస్సును పునః ప్రారంభించారు. బస్సు సౌకర్యం కల్పించడంతో విద్యార్థులు, గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: TSRTC: ఆర్టీసీ నంబర్‌తో ప్రైవేట్ బస్సు.. ఇన్ని రోజులు గుర్తించలేదా..?