ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా మూడో రోజు కొనసాగిన కొవిడ్ టీకా పంపిణీ - amaravati news one

రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమం మూడోరోజు పూర్తయింది. ముందుగా వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు అందించారు. వ్యాక్సిన్ వేసుకున్న వారిలో ఇంతవరకు ఏ విధమైన అనారోగ్య సమస్యలూ కనిపించలేదని అధికారులు పేర్కొన్నారు.

Statewide third-day covid vaccine distribution program
రాష్ట్రవ్యాప్తంగా మూడోరోజు కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమం
author img

By

Published : Jan 18, 2021, 9:09 PM IST

కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను రాష్ట్రవ్యాప్తంగా మూడోరోజు నిర్వహించారు.ఇందులో భాగంగా ముందుగా వైద్య సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టీకా​ను అందించారు. వ్యాక్సిన్ వేసుకున్న వారిలో ఎటువంటి సమస్యలూ.. తలెత్తలేదని అధికారులు తెలిపారు.

నెల్లూరు జిల్లాలో..

నెల్లూరు జిల్లాలోని నాయుడుపేటలో ఉదయం నుంచే కొవిడ్ పంపిణీ జోరుగా సాగింది. పెళ్లకూరు, నాయుడుపేట మండలాల్లోని వైద్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలకు వ్యాక్సిన్​ను అందించారు. తమకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదని వ్యాక్సిన్ వేయించుకున్న వైద్య సిబ్బంది తెలిపారు. రెండు రోజుల నుంచి రోజుకు 74 మందికి చొప్పున టీకా వేశారు.

గుంటూరు జిల్లా..

రేపల్లె పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ వాక్సిన్ టీకా ప్రక్రియను మూడో రోజు వైద్యులు ప్రారంభించారు. సాంకేతిక లోపం కారణంగా వ్యాక్సిన్ ప్రక్రియ నిధానంగా సాగింది. తొలి టీకాను ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రవి చౌదరి వేసుకున్నారు. వ్యాక్సిన్ వేసుకునేందుకు సిబ్బంది అధైర్య పడొద్దని సూచించారు. ప్రస్తుతం ఆసుపత్రికి 500 డోసులు వచ్చినట్లు వైద్యులు పేర్కొన్నారు.

రేపల్లె నియోజకర్గంలో మొత్తం 14 కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కరోనా వ్యాక్సిన్ మాస్టర్ ట్రైనర్ డాక్టర్ కిరణ్ తెలిపారు. వ్యాక్సిన్ పై ఎలాంటి అపోహలు పడొద్దని సూచించారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని రేపల్లె మునిసిపాలిటీ కమిషనర్ విజయ సారధి అన్నారు. వ్యాక్సిన్ వలన ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని చెప్పారు.

తూర్పు గోదావరిలో..

తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని తాళ్లరేవు , ఐ. పోలవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం మండలాల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మూడు రోజు జరిగింది. అదే క్రమంలో వ్యాధి లక్షణాలున్నవారికి పరీక్షలు నిర్వహించారు. నియోజవర్గంలోని 400 మందికి టీకాలు వేసేందుకు ఆరోగ్య శాఖ సిబ్బందిని గుర్తించింది. ఇప్పటికే వారికి వైద్యులు తగు సూచనలు చేశారు. టీకా వేయించుకునేందుకు సిబ్బంది ఉత్సాహంగా ముందుకొచ్చారు.

రోజుకో మండలం చొప్పున 100 మందికి వ్యాక్సిన్ అందించాలని అధికారులు నిర్దేశించినా.. సాంకేతిక లోపం కారణంగా ఆలస్యం జరిగింది. మూడు రోజుల్లో కేవలం 50 శాతం మందికి మాత్రమే టీకా వేయగలిగామని అధికారులు తెలిపారు. వ్యాక్సిన్ వేసుకున్న వారిలో ఇంతవరకు ఏ విధమైన అనారోగ్య సమస్యలూ కనిపించలేదని పేర్కొన్నారు.

అనంతపురంలో..

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ దయాకర్ ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొవిడ్ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరు వేయించుకోవాలన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 81 కరోనా కేసులు... ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.