విశ్వవిద్యాలయాలు క్రమం తప్పకుండా స్నాతకోత్సవాలు జరపాలన్నారు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. కొవిడ్‌కు ముందు 3, 4 ఏళ్లకు ఒకసారి స్నాతకోత్సవాలు జరిపేవారన్న ఆయన.. ఏటా స్నాతకోత్సవాలు జరపాలని గతంలోనే వీసీలకు ఆదేశాలు ఇచ్చామని గుర్తు చేశారు. కొన్ని వర్సిటీల్లో ఇప్పటికీ జాప్యం జరుగుతుందని గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొవిడ్ దృష్ట్యా భౌతికంగా వీల్లేకున్నా.. వర్చువల్‌గా స్నాతకోత్సవాలు జరపాలని ఆదేశించారు. ఏటా స్నాతకోత్సవాలు జరిపేందుకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌కు ఆదేశాలు జారీ చేశారు.
'విశ్వవిద్యాలయాలు క్రమం తప్పకుండా స్నాతకోత్సవాలు జరపాలి. కొవిడ్‌కు ముందు 3, 4 ఏళ్లకు ఒకసారి స్నాతకోత్సవాలు జరిపేవారు. ఏటా స్నాతకోత్సవాలు జరపాలని గతంలోనే వీసీలకు ఆదేశాలిచ్చాం. కొన్ని వర్సిటీల్లో ఇప్పటికీ జాప్యం జరుగుతోంది. కొవిడ్ దృష్ట్యా భౌతికంగా వీల్లేకున్నా.. వర్చువల్‌గా జరపండి' - రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
ఇదీ చదవండి