భద్రాచలంలో ఏప్రిల్ 2న జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవం ఏర్పాట్లను రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఇవాళ పరిశీలించారు. రేపు ప్రధాన ఎదుర్కోలు మహోత్సవం, కల్యాణం, పట్టాభిషేక ఉత్సవాలు జరగనున్నాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వేడుకల్లో పాల్గొనేందుకు రేపు భద్రాచలం రానున్నారు.
ఏప్రిల్ 2న జరిగే సీతారాముల కల్యాణానికి మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. కరోనా వైరస్ ప్రభావం కారణంగా 30 మందిలోపే అర్చకులు వైదిక పెద్దలు, వీఐపీలతో కల్యాణ క్రతువు జరపనున్నారు. భక్తులంతా ప్రసార మాధ్యమాల ద్వారా సీతారాముల కల్యాణం చూసి తరించాలని దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ కోరారు.