ETV Bharat / city

పదో తరగతిలో ఆరు ప్రశ్నపత్రాలే? - ssc exams news

కొవిడ్ కారణంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదోతరగతి ప్రశ్నపత్రాల సంఖ్యను ఆరుకు తగ్గించాలని రాష్ట్ర విద్యాశాఖ భావిస్తోంది.

state education department intends to reduce the tenth grade question papers to six.
పదో తరగతిలో ఆరు ప్రశ్నపత్రాలే?
author img

By

Published : Dec 12, 2020, 6:01 AM IST

కరోనా నేపథ్యంలో పదోతరగతి ప్రశ్నపత్రాలను ఆరుకు తగ్గించాలని విద్యాశాఖ భావిస్తోంది. గతేడాది ప్రశ్నపత్రాల సంఖ్యను తగ్గించినప్పటికీ కొవిడ్‌-19 ఉద్ధృతి కారణంగా పరీక్షలను నిర్వహించలేదు. అప్పట్లో ఒక్క ఏడాదికి మాత్రమే ఈ విధానమంటూ పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనూ అదే పరిస్థితి కొనసాగుతుండటంతో ఆరు ప్రశ్నపత్రాలతోనే పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. గతంలో ఒక్కో పేపర్‌ 50మార్కులకు ఉండగా ఇప్పుడు ఒక్క పేపరే వంద మార్కులకు నిర్వహించనున్నారు. పరీక్ష వ్యవధిని అర్ధగంట పెంచే అవకాశం ఉంది. ఏప్రిల్‌ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:

ఉపాధ్యాయ బదిలీల్లో కొంత మేర ఖాళీలను బ్లాక్ చేశాం: మంత్రి సురేశ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.