రాష్ట్ర మంత్రి వర్గం ఈ నెల 18న సమావేశం కానుంది. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్లో ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు, ఈనెల 25న 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ ఏర్పాట్లు, గృహ నిర్మాణం, సహా ఇసుక సరఫరా సమస్యలు, తదితర అంశాల పరిష్కారం పై చర్చించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. పలు విభాగాల్లో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు. మంత్రి వర్గ సమావేశం అజెండాలోని అంశాలపై ఈనెల 16 మధ్యాహ్నం 3 గంటలలోపు తగిన ప్రతిపాదనలు పంపాలని అన్ని విభాగ అధిపతులకు సీఎస్ నీలం సాహ్నీ ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి: పోలవరం నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం జగన్