ఆర్టీసీలో స్మార్ట్ కార్డు సేవలు ప్రారంభం - smart card services in RTC news
టిక్కెట్ల కోసం పడే చిల్లర కష్టాలు తీర్చేందుకు ఆర్టీసీ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. బస్సుల్లో ప్రయాణానికి స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టింది. మెట్రో రైళ్లలో ప్రయాణానికి వినియోగిస్తోన్న స్మార్ట్ కార్డులను... ఆర్టీసీలోనూ ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. విజయవాడలో వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి 'ఛలో' ప్రతినిధులు స్మార్ట్ కార్డు సేవలను ప్రారంభించారు.