ETV Bharat / city

Exams Schedule: పది, ఇంటర్‌ పరీక్షల షెడ్యూలు విడుదల.. ఏప్రిల్​లో ఇంటర్

మే 2 నుంచి మే 13 వరకు పదో తరగతి పరీక్షలు

author img

By

Published : Feb 10, 2022, 1:19 PM IST

Updated : Feb 11, 2022, 6:29 AM IST

13:17 February 10

ఏప్రిల్ 8 నుంచి 28 వరకు ఇంటర్ పరీక్షలు

Exams Schedule Released: రెండేళ్ల నుంచి కొవిడ్‌ కారణంగా ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించలేకపోయామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. కర్నూలు నగర శివారులో ఉన్న ట్రిపుల్‌ ఐటీలో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల షెడ్యూలును గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరీక్షల నిర్వహణ సమయంలో కొవిడ్‌ నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.

ఏప్రిల్‌ 8 నుంచి ఇంటర్​ పరీక్షలు

మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌, ఏప్రిల్‌ 8వ తేదీ నుంచి 28 వరకూ పరీక్షలు ఉంటాయన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. ప్రాక్టికల్స్‌ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండు విడతల్లో పరీక్షలు ఉంటాయన్నారు. మార్చి 7వ తేదీన నైతిక, మానవ విలువల పరీక్ష, మార్చి 9న పర్యావరణ విద్య పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తామన్నారు.

మే 2 నుంచి 13వ వరకు పది పరీక్షలు

పదో తరగతి పరీక్షలను మే 2 నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 12 నుంచి 19వ తేదీ వరకు అపరాధ రుసుము లేకుండా పదో తరగతి పరీక్షల రుసుము రూ.125 చెల్లించాలన్నారు. అపరాధ రుసుము రూ.50తో ఈ నెల 20 నుంచి 24 వరకు, అదనపు అపరాధ రుసుము రూ.200తో 25 నుంచి మార్చి 1వ తేదీ వరకు, అపరాధ రుసుము రూ.500తో మార్చి 2 నుంచి 6వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉందన్నారు.www.bse.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా పరీక్ష రుసుము చెల్లించవచ్చన్నారు. కార్యక్రమంలో ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కలెక్టర్‌ కోటేశ్వరరావు, జేసీ(ఆసరా) శ్రీనివాసులు, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

ఇంటర్​ పరీక్షల వివరాలు
పదో తరగతి పరీక్షల తేదీలు

ఇదీ చదవండి:

టికెట్‌ ధరలకు సంబంధించి శుభంకార్డు పడిందని భావిస్తున్నాం: చిరంజీవి

Last Updated : Feb 11, 2022, 6:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.