కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్ష కేంద్రాల కేటాయింపులో ప్రభుత్వం నూతన విధానాన్ని పాటించబోతుంది. విద్యార్థి నివాస ప్రాంతానికి సమీపంలోనే పరీక్ష కేంద్రాలను కేటాయించేందుకు కసరత్తు చేస్తోంది.
పట్టణాలు, నగరాల్లో వసతిగృహాల్లో ఉండి పదో తరగతి చదివిన విద్యార్థులు లాక్‌డౌన్‌తో స్వస్థలాలకు వెళ్లారు. చదివిన పాఠశాల ప్రకారం కేంద్రాలను కేటాయిస్తే వారంతా తిరిగి వచ్చి వారం పాటు ఉండాల్సి ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు వారి నివాసానికి దగ్గరలోనే పరీక్ష కేంద్రాలను కేటాయించాలని భావిస్తోంది.
ఇదీ చదవండి: