తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి మరోసారి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. రెండు నెలల క్రితం కరోనా బారిన పడి కోలుకున్న ఆయనకు.. మళ్లీ వైరస్ సోకింది. నిన్న(శనివారం) స్వల్ప లక్షణాలు కనిపించడంతో పోచారం.. కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు తేలింది.
అనారోగ్య సమస్యలు లేకపోయినప్పటికీ వైద్యుల సూచన మేరకు ఆయన గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం సభాపతి పోచారం ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన, సన్నిహితంగా మెలిగిన వ్యక్తులు కొవిడ్ పరీక్ష చేయించుకోవాలని పోచారం సూచించారు. తగు జాగ్రత్తలతో హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని పేర్కొన్నారు.
- ఇదీ చదవండి: Gold Cheating: తక్కువ ధరకే బంగారం ఇస్తామంటూ మోసం