ETV Bharat / city

మరో 8 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే - ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే

ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే మరో 8 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. ఈ నెల 13 నుంచి 26 మధ్యలో ఈ రైళ్లు రాకపోకలు చేయనున్నాయి.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/08-October-2020/9104372_634_9104372_1602175708522.png

author img

By

Published : Oct 8, 2020, 10:29 PM IST

Updated : Oct 8, 2020, 11:10 PM IST

కరోనా వైరస్‌ విజృంభణతో నిలిచిపోయిన రైలు సర్వీసులను రైల్వే శాఖ దశల వారీగా పునరుద్ధరిస్తోంది. ఇటీవల దేశ వ్యాప్తంగా 39 రైళ్లు నడిపేందుకు అనుమతించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే మరో 8 ప్రత్యేక రైళ్లను పట్టాలెక్కించనున్నట్టు ప్రకటించింది.

ఇప్పటికే నడుస్తున్న రైళ్లకు అదనంగా తెలుగు రాష్ట్రాల మధ్య ఈ రైళ్లు సేవలందించనున్నాయి. సికింద్రాబాద్‌- విశాఖపట్నం; లింగంపల్లి- కాకినాడ పట్టణం, తిరుపతి -విశాఖపట్నం, సికింద్రాబాద్‌- షాలిమార్‌ మధ్య ఈ నెల 13 నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు తెలిపింది.

* ఈ నెల 13 నుంచి ప్రతి మంగళవారం ఉదయం 5.40 గంటలకు సికింద్రాబాద్‌ - షాలిమార్‌ రైలు

* ఈ నెల 14 నుంచి ప్రతి బుధవారం సాయంత్రం 4.05 గంటలకు షాలిమార్‌ - సికింద్రాబాద్‌ రైలు

* ఈ నెల 14 నుంచి ప్రతి బుధ, శుక్ర, ఆదివారాల్లో రాత్రి 9.50 గంటలకు తిరుపతి - విశాఖ రైలు

* ఈ నెల 15 నుంచి ప్రతి గురు, శని, సోమ వారాల్లో రాత్రి 10.25గంటలకు విశాఖ - తిరుపతి రైలు

* ఈ నెల 17 నుంచి ప్రతి శనివారం సాయంత్రం 5.50 గంటలకు సికింద్రాబాద్‌ - విశాఖ రైలు

* ఈ నెల 18 నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 6.55 గంటలకు విశాఖ- సికింద్రాబాద్‌ రైలు

* ఈ నెల 26 నుంచి ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో రాత్రి 7.55 గంటలకు లింగంపల్లి - కాకినాడ రైలు

* ఈ నెల 25 నుంచి ప్రతి మంగళ, గురు, ఆదివారాల్లో 8.10 గంటలకు కాకినాడ - లింగంపల్లి రైలు

Last Updated : Oct 8, 2020, 11:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.