టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కలిశారు. పతకం సాధించినందుకు ఈ సందర్భంగా సీఎం ఆమెను అభినందించి సత్కరించారు. విశాఖలో వెంటనే బ్యాడ్మింటన్ అకాడమీని ప్రారంభించాలని సింధుకు సూచించారు. రాష్ట్రం నుంచి చాలా మంది సింధులు తయారు కావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 30లక్షలు నగదు పురస్కారాన్ని అధికారులు ఆమెకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సింధు తల్లిదండ్రులు పీవీ రమణ, విజయ, సోదరి దివ్య పాల్గొన్నారు.
‘‘ముఖ్యమంత్రిని కలవడం ఆనందంగా ఉంది. ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు సీఎం నన్ను ఆశీర్వదించి పతకం తీసుకురావాలని కోరారు. ఏపీ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోంది. ఉద్యోగాల్లో క్రీడా కోటాకు రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం గొప్ప విషయం. జాతీయ స్థాయిలో గెలిచిన వారికి వైఎస్సార్ పురస్కారాలిస్తున్నారు. బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం స్థలం కేటాయించింది. త్వరలోనే దాన్ని ప్రారంభిస్తా’’ - పీవీ సింధు, ఒలింపిక్స్ కాంస్య పతక విజేత.
ఇదీ చదవండి: