ETV Bharat / city

Shilpa Chowdary case: శిల్పా చౌదరిని కస్టడీకి కోరుతూ.. పోలీసుల పిటిషన్‌ - Shilpa Chaudhary crime news

అధిక వడ్డీలు ఇస్తానని నమ్మించి రూ.కోట్లలో వసూలు చేసిన శిల్పా చౌదరిపై.. మరో కేసు (Shilpa Chowdary Case Update) నమోదైంది. తన దగ్గర రూ.2.4 కోట్లు తీసుకుని మోసం చేసిందని తెలంగాణలోని నార్సింగి పీఎస్​లో మరో మహిళ ఫిర్యాదు చేసింది.

Shilpa Chaudhary case
Shilpa Chaudhary case
author img

By

Published : Nov 29, 2021, 8:22 PM IST

Shilpa Chowdary case: అధిక వడ్డీ ఇస్తానంటూ రూ.కోట్లలో మోసాలకు పాల్పడిన శిల్పాచౌదరిపై మరో కేసు నమోదైంది. తన వద్ద రూ.2.4 కోట్లు తీసుకుని మోసం చేసిందని తెలంగాణలోని నార్సింగి ఠాణాలో మరో మహిళ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గతేడాది అధిక వడ్డీ ఇస్తానని డబ్బు తీసుకుందని.. ఇవ్వకుండా మోసం చేసిందని బాధితురాలి ఫిర్యాదులో పేర్కొంది. ఇప్పటివరకూ నార్సింగి పీఎస్​లోనే శిల్పా చౌదరిపై మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి.

కస్టడీ పిటిషన్ వేసిన పోలీసులు
శిల్పా చౌదరి దంపతులు అరెస్టై ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. కేసును లోతుగా దర్యాప్తు చేసేందుకు.. నిందితులను కస్టడీకి కోరారు పోలీసులు. ఈ మేరకు ఉప్పరపల్లి కోర్టులో నార్సింగి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఏడు రోజుల కస్టడీ కోరారు. ఈ పిటిషన్ పై విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. మరోవైపు శిల్పా చౌదరి దంపతులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

సమగ్ర దర్యాప్తు జరిగితేనే..
శిల్పా చౌదరి విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి మోసాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. తనను వ్యాపారవేత్తగా పరిచయం చేసుకుని రూ.కోట్లలో మోసాలు చేసినట్లు అనుమానిస్తున్నారు. వచ్చిన డబ్బుతో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని వెల్లడించారు.

అధిక వడ్డీ ఇస్తానని, వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే లాభాలు ఇస్తానని నమ్మించి.. మోసాలకు పాల్పడేవారని డీసీపీ తెలిపారు. బాధితులను ఆకర్షించేందుకు పేజ్​ త్రీ పార్టీలు ఇచ్చి రూ.కోట్లలో కుచ్చుటోపీ పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దంపతుల బాధితుల సంఖ్య పూర్తిగా తేలేందుకు మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:

Shilpa Chowdary Case Update: కోట్లు తీసుకుని బెదిరింపులు.. శిల్పాచౌదరిపై మరో కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.