ETV Bharat / city

కళామందిర్​లో నగదు కాజేసిన సెక్యూరిటీ గార్డ్

author img

By

Published : Dec 14, 2020, 4:49 PM IST

తాను పని చేస్తున్న సంస్థకే కన్నం వేశాడు సెక్యూరిటీ గార్డ్​. పక్కా ప్లాన్ రచించి చోరీ చేశాడు. రాత్రివేళలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో లాకర్ తెరిచి నగదు కాజేశాడు. రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి పరారయ్యాడు.

security guard stole money from Kalamandir
కళామందిర్​లో నగదు కాజేసిన సెక్యూరిటీ గార్డ్

ఓ సెక్యూరిటీ గార్డ్ అన్నం పెట్టిన సంస్థకు కన్నం వేశాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కూకట్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కూకట్‌పల్లి భాగ్యనగర్ కాలనీలోని కళామందిర్ వస్త్ర దుకాణంలో మోనీదాస్ అనే వ్యక్తి నాలుగేళ్ల నుంచి సెక్యూరిటీ గార్డుగా‌ పని చేస్తున్నాడు. అసోంకు చెందిన మోనీదాస్ భార్యతో శంషీగూడలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నాడు. ఆదివారం రాత్రి విధులు నిర్వహిస్తున్న మోనీదాస్... చాకచక్యంగా లాకర్ తాళం చెవిని మేనేజర్​కు ఇవ్వకుండా తన వద్ద పెట్టుకున్నాడు. దుకాణం మూసేశాక విధులు నిర్వహిస్తున్న మోనీదాస్ లాకర్ తాళాలు తెరిచి రూ.8లక్షల 95 వేలను కాజేశాడు. రాత్రికి రాత్రే శంషీగూడలోని ఇంటిని ఖాళీ చేసి పరారయ్యాడు.

సోమవారం తెల్లవారుజామున లాకర్ తెరిచేందుకు వచ్చిన మేనేజర్... తాళంచెవి తమ వద్ద లేదని గ్రహించారు. మరొక తాళం చెవితో తెరిచి చూడగా అందులో ఉండాల్సిన నగదు మాయం అవడంతో చోరీ జరిగిందని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.