నాలుగో విడత పంచాయతీ ఎన్నికల వివరాలను ఎన్నికల సంఘం వెల్లడించింది. 161 మండలాల్లోని 3,299 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నట్లు తెలిపింది. 553 సర్పంచి స్థానాలు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 2,744 గ్రామాల్లో ఈ నెల 21న ఓటింగ్ నిర్వహిస్తామని చెప్పింది. 7,475 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు పేర్కొంది. 33,435 వార్డులకుగాను 10,921 ఏకగ్రీవమైనట్లు ప్రకటించింది. మిగిలిన 22,422 వార్డులకు ఈ నెల 21న ఓటింగ్ జరగనుండగా.. 49,089 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని వివరించింది.
ఇదీ చదవండి: