ETV Bharat / city

పెరుగుతున్న సీజనల్​ వ్యాధుల తీవ్రత.. హెచ్చరిస్తున్న నిపుణులు - seasonal deceases

తెలంగాణలో కొవిడ్‌ కలవరపెడుతూనే ఉంది. కేసుల సంఖ్య ప్రస్తుతానికి తగ్గినా శీతాకాలం నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోకపోతే.. మున్ముందు మళ్లీ వైరస్‌ విజృంభించవచ్చని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో కాలానుగుణ(సీజనల్‌) వ్యాధుల తీవ్రతా తెలంగాణలో పెరుగుతోంది. గతేడాది జనవరి నుంచి అక్టోబరు 23 నాటితో ఈ ఏడాదిలో ఇదే కాలానికి పోల్చితే ఈ వ్యాధులు తక్కువగా నమోదైనా.. గత ఏడు వారాలను పరిశీలిస్తే వ్యాధుల ఉద్ధృతి క్రమంగా పెరుగుతున్నట్లుగా వారు విశ్లేషిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ, ఇంటాబయటా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

seasonal diseases
ప్రబలుతున్న కాలానుగుణ వ్యాధులు
author img

By

Published : Oct 30, 2020, 11:51 AM IST

వాతావరణ మార్పుల నేపథ్యంలో కలుషిత నీరు, ఆహారం ప్రధాన కారణాలుగా నీళ్ల విరేచనాలు(డయేరియా), టైఫాయిడ్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దోమకాటుతో వచ్చే డెంగీ, మలేరియా జ్వరాలు సైతం చాపకింద నీరులా పెరిగిపోతున్నాయి. అకస్మాత్తుగా వచ్చే జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరాలతో కూడిన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు(అక్యూట్‌ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్లు- ఏఆర్‌ఐ) సైతం అన్ని వయసుల వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కారణాలు తెలియకుండా సోకుతున్న జ్వరాలు కరోనా సూచికలేమోననే ఆందోళనతో ప్రజలు భీతిల్లుతున్నారు. ఈ క్రమంలో అంటువ్యాధుల ముప్పేట ముట్టడిని సమర్థంగా ఎదుర్కోవాలంటే పౌరులంతా పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని, ఆహారవిహారాదుల పరంగా క్రమశిక్షణ పాటించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

వర్షాలు.. వరదలు.. చల్లదనం

కాలానుగుణ వ్యాధులు ఆగస్టు నుంచి ప్రభావం చూపిస్తుంటాయి. ఈ ఏడాదిలో ఆగస్టు వరకూ దాదాపు 40-50 శాతం మేర అంటువ్యాధులు తక్కువగా నమోదయ్యాయి. కరోనా కట్టడిలో భాగంగా మాస్కులు ధరించడం, తరచూ చేతులు శుభ్రపరచుకోవడం, ఇళ్లలో వండిన ఆహారానికే ప్రాధాన్యమివ్వడం, ఇంటి నుంచే ఉద్యోగాలు చేస్తుండడం.. ఇంటాబయటా శుభ్రతపై దృష్టిపెట్టడం, ప్రభుత్వం ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం.. తదితరాల దృష్ట్యా ఈసారి కలుషిత నీరు, ఆహారం, దోమలు, గాలి ద్వారా వ్యాపించే వ్యాధులన్నీ గణనీయంగా తగ్గాయనేది నిపుణుల విశ్లేషణ. ఇప్పుడా పరిస్థితి మారింది.

కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలన్నీ పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. వినోద, ఆహ్లాద కార్యకలాపాలన్నీ అందుబాటులోకి వచ్చాయి. ప్రజలు ఎప్పటిలాగా సంచరిస్తున్నారు. హోటళ్లలో, రోడ్లపై తింటున్నారు. కొవిడ్‌ కేసులు కాస్త తగ్గగా.. కొందరు ఇష్టానుసారం మసులుతున్నారు. మరోవైపు ఇటీవలి భారీవర్షాలతో వాతావరణం కూడా చల్లబడింది. ఈ పరిణామాలన్నీ కొవిడే కాదు.. తగ్గిన అంటువ్యాధులన్నీ తిరిగి దాడిచేయడానికి కారణమవుతాయనే ఆందోళన వైద్యవర్గాల్లో వ్యక్తమవుతోంది.

దోమకాటు ముప్పు

గతేడాది తెలంగాణ రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన డెంగీ జ్వరాలు.. ఈ ఏడాదీ ఉనికిని చాటుకుంటున్నాయి. 2019 జనవరి నుంచి అక్టోబరు 23 నాటికివి రాష్ట్రంలో 2,333 నమోదవగా.. 2020లో ఇదే కాలానికి 1,717గా నిర్ధరించారు. ఇందులో గత 7 వారాల్లోనే 513 కొత్త కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది సెప్టెంబరు తర్వాతే అత్యధికంగా డెంగీ కేసులు నమోదై.. ఆ ఏడాది మొత్తం 13వేలకు పైగా నిర్ధరణ కావడం గమనార్హం.

ఈ ఏడాదీ అదే పరిస్థితి పునరావృతమై.. కొవిడ్‌తో పాటు డెంగీ సైతం విజృంభిస్తే ప్రజారోగ్యం చిన్నాభిన్నమవుతుందనే భయాందోళనలు రేగుతున్నాయి. ఇక మలేరియా జ్వరాలు ఈ ఏడాదిలో ఇప్పటికే 715 నమోదు కాగా, గత ఏడు వారాల్లో కొత్తగా 97 కేసులు నిర్ధరించారు. రాష్ట్రంలో మలేరియా ప్రభావిత గ్రామాలు సుమారు 1,000 వరకూ ఉండగా.. డెంగీ కేసులు ఎక్కువగా ఉన్నవి దానికి రెట్టింపని వైద్యవర్గాలు తెలిపాయి.

శ్వాసకోశ వ్యాధుల తీవ్రత

వాతావరణ మార్పులతో ప్రతిసారి వైరల్‌, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు విజృంభిస్తుంటాయి. అకస్మాత్తుగా శ్వాసకోశ సమస్యలు పెరుగుతుంటాయి. రాష్ట్రంలో గతేడాది జనవరి- అక్టోబరు 23 మధ్య 5,22,828 మంది బాధితులు ఏఆర్‌ఐతో ప్రభుత్వ వైద్యంలో చికిత్స పొందారంటే.. అప్పటి తీవ్రత ఇట్టే అర్థమవుతుంది. ఈ ఏడాది ఇదే కాలానికి 2,08,435 మంది శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల బారినపడ్డారు.

గత 53 రోజుల్లో కొత్తగా 30,433 కేసులు నమోదయ్యాయి. ఇక కారణాలు తెలియకుండా గుర్తించే జ్వరాలకు సంబంధించి ఈ ఏడాదిలో 1,19,931 కేసులు నిర్ధరణయ్యాయి. గతేడాది ఇదే కాలానికి నమోదైన కేసులతో(3,28,880) పోల్చితే.. ఇవి దాదాపు సగం కంటే తక్కువే అనిపిస్తున్నా... గత ఏడు వారాల్లో కొత్తగా 32,479 మంది వీటితో చికిత్స పొందడం గమనార్హం. ఇక నిమోనియా కేసులు గత 53 రోజుల్లో కొత్తగా 352 నమోదయ్యాయి.

విరేచనాలతో ప్రాణాంతక ముప్పు

నీళ్ల విరేచనాలు అతి సాధారణ జబ్బు. అపరిశుభ్ర చేతులతో తినడం, తాగడం.. ఆహారం, నీళ్లు కలుషితమవడం తదితర కారణాలతో ఇది ఎక్కువగా దాడి చేస్తోంది. భారత్‌లో ఏటా రెండు లక్షల మంది పిల్లలు డయేరియా బారినపడి మృతిచెందుతుండగా.. ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలకు 13 శాతం డయేరియానే కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. 2019 జనవరి నుంచి అక్టోబరు 23 నాటికి డయేరియా, గ్యాస్ట్రోఎంటరైటిస్‌తో 3,29,262 మంది చికిత్స పొందగా.. 2020లో ఇదే సమయానికి 1,22,102 మంది ప్రభుత్వ వైద్యంలో సేవలు పొందారు. అయితే గత నెల నుంచి ఇప్పటి వరకూ కొత్తగా 17,935 మంది ఈ వ్యాధుల బారినపడడం గమనార్హం. జిగట విరేచనాలు, కామెర్లతో బాధపడుతున్న రోగుల సంఖ్యా పెరుగుతోంది.

స్వీయ నియంత్రణ పాటించాలి

ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు అనేకం నిర్వహిస్తోంది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ చికిత్సకు అవసరమైన ఔషధాలను అందుబాటులో ఉంచింది. ప్రజలు కూడా స్వీయనియంత్రణ పాటించాలి. ఇళ్లలో, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. రోడ్డు మీద ఆహారాన్ని తీసుకోవద్దు. సురక్షిత తాగునీరు చాలా ముఖ్యం. రోగనిరోధక శక్తిని పెంచే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను తీసుకోవాలి. జ్వరం, వాంతులు, విరేచనాల బారినపడితే.. వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందాలి. కరోనాను ఎదుర్కోవడంలో ఎలా సహకరించారో.. అలాగే కాలానుగుణ వ్యాధులను అరికట్టడంలోనూ ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలి.

-డాక్టర్‌ జి.శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు

2020లో జనవరి 1 నుంచి అక్టోబరు 23 వరకూ

వ్యాధుల తీవ్రత అధికంగా జిల్లాలు..

నీళ్ల విరేచనాలు: ఆదిలాబాద్‌(10,889), హైదరాబాద్‌(12,506), భద్రాద్రి కొత్తగూడెం(12,033)

జిగట విరేచనాలు: భద్రాద్రి కొత్తగూడెం (1207), నాగర్‌కర్నూలు(6103)

టైఫాయిడ్‌: ఆదిలాబాద్‌(350), హైదరాబాద్‌(1056), కరీంనగర్‌(3455), ములుగు(326), పెద్దపల్లి(324), సిరిసిల్ల రాజన్న(398), వికారాబాద్‌(589)

మలేరియా: ఆసిఫాబాద్‌ కుమురంభీం(76), భద్రాద్రి కొత్తగూడెం(318), ములుగు(125)

డెంగీ: ఆదిలాబాద్‌(141), హైదరాబాద్‌(491), మేడ్చల్‌ మల్కాజిగిరి(146), మహబూబ్‌నగర్‌(140), రంగారెడ్డి(132)

కారణాలు తెలియని జ్వరాలు: ఆదిలాబాద్‌(20,532), ఆసిఫాబాద్‌ కుమురంభీం(10,242), జగిత్యాల(7944), భద్రాద్రి కొత్తగూడెం(8215), మంచిర్యాల(7524), ములుగు(8573), నల్గొండ(5067), నిర్మల్‌(8842), సిద్దిపేట(5605)

హఠాత్తుగా సోకే శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు: ఆదిలాబాద్‌(13,137), జయశంకర్‌ భూపాలపల్లి(14,506), హైదరాబాద్‌(42,200), భద్రాద్రి కొత్తగూడెం(12,500), మహబూబాబాద్‌(11,262), వరంగల్‌ నగర(14,827)

నిమోనియా: హైదరాబాద్‌(297), కామారెడ్డి(154), ములుగు(228), నిజామాబాద్‌(351).

ఇదీ చదవండి:

తూర్పు గోదావరి జిల్లాలో పెళ్లి వ్యాను బోల్తా.. ఏడుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.