విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో.. ఇందిరాగాంధీ స్టేడియంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కృష్ణా జిల్లా కలెక్టర్, విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్‌తో కలిసి... మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వేడుకలు ప్రారంభించారు. గణేశస్తుతి, భరతనాట్యం ఆధ్యాత్మికత పంచాయి.
సంబరాల్లో ప్రవాస భారతీయులు
తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం పొట్టిలంకలో 7 దేశాల నుంచి ప్రవాస భారతీయులు... సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. కోలాటాలు, కోడిపందేలను ఆసక్తిగా తిలకించారు. చిన్నారులు సంప్రదాయ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. రాజమహేంద్రవరం ఎంపీ భరత్ వేడుకల్లో పాల్గొన్నవారిని ఉత్సాహపరిచారు.
అలరించిన సంప్రదాయ నృత్యాలు
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో కళింగ కోమట్ల యువజన సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా నుంచీ... కళింగ కోమట్ల బంధుగణం ఒకేచోట చేరి సరదాగా గడిపారు. విశాఖలో ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ లో నోరూరించే పిండి వంటకాలను అతిథులు ఆరగించారు. ఈ సందర్భంగా సంప్రదాయ నృత్యాలు అలరించాయి.
అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సంక్రాంతి వేడుకల్లో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పాల్గొన్నారు. సత్యసాయి సంస్థల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఇదీ చదవండి: