గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇసుక బుకింగ్ చేసుకునే అవకాశం శుక్రవారం నుంచి అందుబాటులోకి రానుంది. ఏపీఎండీసీ పోర్టల్లో ఇసుక బుకింగ్ ఆరంభమైన వెంటనే కొన్ని నిల్వ కేంద్రాల్లో అయిపోతుండటంతో గ్రామ, వార్డు సచివాలయాల్లో బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ గురువారం సాయంత్రానికి సిద్ధం కానుంది. గుత్తేదారుల తదితరులు పెద్ద ఎత్తున ఇసుక కావాలంటే సంయుక్త కలెక్టర్(జేసీ) అనుమతి తీసుకునేలా సాఫ్ట్ వేర్ లో మార్పులు చేశారు.
ఇదీ చదవండి: