ఇసుక డెలివరీకి ముందుకొచ్చే లారీ యజమానులు ఏపీఎండీసీలో పేర్లు నమోదు చేయించుకుంటారు. ఏ చిరునామాకు డెలివరీ చేయాలో లారీ యజమానికి ఫోనులో సందేశం వెళ్తుంది. ఇసుక బుక్ చేసుకున్నవారి పేరు, ఫోన్ నంబరు తెలియడంతో.. వారికి ఫోన్‌చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇలా డిమాండు చేస్తే జిల్లా ఇసుక అధికారి (డీఎస్‌వో)కి ఫిర్యాదు చేయాలని ఏపీఎండీసీ అధికారులు కోరారు.
రోజంతా బుకింగ్
* నిల్వ కేంద్రాల్లో నిమిషాల్లోనే ఆన్‌లైన్‌లో ఇసుక అయిపోవడంతో కొన్నిచోట్ల రోజంతా ఆన్‌లైన్ బుకింగ్ కల్పించడంపై ఏపీఎండీసీ కసరత్తు చేస్తోంది. రాజమహేంద్రవరంలో ఇలా రోజంతా బుక్ చేసుకునే అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. త్వరలో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.
* గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇసుక బుకింగ్‌కు కసరత్తు మొదలైంది. వీటిలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బుకింగ్‌కు వీలుంటుందని చెబుతున్నారు. వీటిని ఏపీఎండీసీతో అనుసంధానం చేయనున్నారు.
* గతంలో వాగులు, వంకలు, చిన్న నదుల్లోనే స్థానిక గ్రామాల ప్రజలు ఎడ్ల బండ్లలో తీసుకెళ్లేందుకు వీలుండేది. ఇపుడు పెన్నా, వంశధార, నాగావళి వంటి పెద్ద నదుల పక్కన ఉండేవారు ఉచితంగా ఎడ్ల బండ్లలో ఇసుక తీసుకెళ్లేందుకు అవకాశం ఇస్తున్నారు. దీనికి నిబంధనలు రూపొందిస్తున్నారు.
‘ఆన్‌లైన్‌లో మీరు బుక్ చేసిన ఇసుక డెలివరీ ఇవ్వాలంటే రూ.వెయ్యి ఇవ్వాలి. స్టాక్ పాయింట్‌లో లోడింగ్‌కు అవి చెల్లిస్తాం. డ్రైవర్‌కు రూ.200 బేటా ఇవ్వాలి. రూ.1200 ఇస్తామంటే ఇసుక తెస్తాం. లేకపోతే మరికొన్ని రోజులు ఆగాలి’.. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన సుబ్బయ్యకు లారీ యజమాని నుంచి వచ్చిన ఫోన్ ఇది.
అనంతపురం జిల్లా యాడికి మండలం రాయలచెరువుకు చెందిన శ్రీరాములు 18 టన్నుల ఇసుక, రవాణా ఛార్జీలకు కలిపి రూ.22,900 చెల్లించారు. ఉరవకొండ నుంచి ఇసుక లోడుతో వచ్చిన లారీ డెలివరీ సమయంలో టోల్ గేట్‌కు రూ.700, ఇద్దరు డ్రైవర్లకు బేటా రూ.600 కలిపి రూ.1,300 అదనంగా తీసుకున్నారు.