ETV Bharat / city

SAJJALA ON GAZETTE: గెజిట్‌ను ముందడుగుగా భావిస్తున్నాం: సజ్జల - gazette on Krishna basin

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధులు నిర్ణయిస్తూ.. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ను స్వాగతిస్తున్నట్లు వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala) తెలిపారు. రాయలసీమ లిఫ్టు వల్ల ఏ ప్రాంతానికీ అన్యాయం జరగదని.. ఈ మేరకు సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

sajjala comments on gazette of krishna and Godavari basin
కేంద్రం ప్రభుత్వ గెజిట్‌ను ముందడుగుగా భావిస్తున్నాం
author img

By

Published : Jul 16, 2021, 2:52 PM IST

Updated : Jul 16, 2021, 8:38 PM IST

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ను స్వాగతిస్తున్నాం

కృష్ణా జలాలపై కేంద్రం గెజిట్ విడుదల చేయడాన్ని ముందడుగుగా భావిస్తున్నామని వైకాపా ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కృష్ణా, గోదావరి బోర్డుల(gazette on Krishna and Godavari board) పరిధులు నిర్ణయిస్తూ.. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అయితే గెజిట్​లో కొన్ని అభ్యంతర అంశాలు ఉన్నాయని.. వాటిని సవరించే కార్యక్రమం జరుగుతుందన్నారు. కృష్ణా జలాలపై ప్రకాశం జిల్లా వారిలో చంద్రబాబు లేనిపోని అనుమానాలను సృష్టిస్తున్నారన్న సజ్జల.. రాయలసీమ లిఫ్టు వల్ల ఏ ప్రాంతానికీ అన్యాయం జరగదన్నారు. ఈ మేరకు సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

చంద్రబాబు హయాంలోనే..

రాయలసీమ లిఫ్టు ఏర్పాటుకు సంబంధించి తెదేపా వైఖరి ఏంటో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు హయాంలోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం నిర్మించిందని, కృష్ణానదిలో 800 అడుగులోపు నీరు తీసుకునేలా ప్రాజెక్టు కడితే దాన్ని చంద్రబాబు ఎందుకు ఆపలేదని ప్రశ్నించారు. విద్యుత్ ఉత్పత్తి పేరిట తెలంగాణ నీటిని వృథాగా వదిలేస్తే చంద్రబాబు మాట కూడా మాట్లాడటం లేదన్నారు.

ప్రకాశం జిల్లాకు నీరిచ్చే ఏర్పాట్లు

ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.1200 కోట్లు ఖర్చు పెట్టిందన్న సజ్జల.. సాగర్ కుడి, లేదా ఎడమ కాలువ ద్వారా ప్రకాశం జిల్లాకు నీరిచ్చే ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. రాయలసీమ లిఫ్టుతో ప్రకాశం జిల్లాకు ఏ విధంగానూ నష్టం జరగదన్నారు. కృష్ణా జలాలకు సంబంధించి భవిష్యత్తులో మన ప్రయోజనాలకు ఎవరూ భంగం కల్గించని రీతిలో సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారన్నారు.

రేపు నామినేటెడ్ పోస్టుల ప్రకటన

నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామన్నారు. రిజర్వేషన్లు జాబితా ఖరారు చేయడంలో చిన్న మార్పులు చేయాల్సి ఉన్నందున ప్రకటనను వాయిదా వేసినట్లు తెలిపారు. శనివారం నామినేటెడ్ పోస్టులను ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

తెదేపా గొంతు కలిపితే మంచిది..

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు పార్లమెంట్ వేదికగా పోరాడతామని.. ప్రతిపక్ష పార్టీగా తెదేపా కూడా గొంతు కలిపితే మంచిదన్నారు.

ఇదీ చదవండి:

WATER DISPUTES: తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులన్నీ బోర్డుల పరిధిలోకి...

Last Updated : Jul 16, 2021, 8:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.