ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్లు నిలిపివేశారు. లాక్‌డౌన్ పొడిగించే అవకాశాలుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బస్సుల రాకపోకలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాకే తిరిగి రిజర్వేషన్లు ప్రారంభించాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఈ నెల 15 తర్వాత ప్రయాణాలు చేసేందుకు అనేకమంది రిజర్వేషన్లు చేసుకున్నందున...వారందరికీ నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో టికెట్ రుసుమును ఆర్టీసీ వెనక్కి ఇచ్చేయనుంది. నగదును ఆన్‌లైన్‌లో ప్రయాణికుల బ్యాంకు ఖాతాకు చెల్లించనున్నారు.
ఇవీ చదవండి: రాష్ట్రంలో మూడోసారి కుటుంబ సర్వే: సీఎం జగన్