జనవరి 1 నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్టు విభాగం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. గురువారం సచివాలయంలో కార్మిక సంఘాలతో ఆర్టీసీ విలీన కమిటీ భేటీ అయింది. కార్మికులకు వర్తించే సౌకర్యాలపై విధానాలపై కమిటీ సభ్యులు చర్చించారు. ఎంప్లాయిస్ యానియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ కార్మిక సంఘం, రిటైర్డ్ ఉద్యోగ సంఘాలు చర్చలో పాల్గొన్నాయి. ఆర్టీసీ ఉద్యోగులందరికీ ఎన్జీవోల తరహాలో... ఓపీఎస్ పెన్షన్ను ఇవ్వడం సహా... మరో 26 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంప్లాయిస్ యూనియన్లు అందించాయి.
ఇదీ చదవండి :