బస్సులో ఉన్న విద్యార్థులు ఒకరిపై ఒకరు పడిపోయారు. విద్యార్థి రోహిత్, కండక్టర్ సుమలత అస్వస్థత గురికావడం వల్ల వెంటనే మంథని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు పంపించారు. ఈ బస్సులో సుమారు 45 మంది విద్యార్థులు ఉన్నారు.
తెలంగాణ: టైర్ పంక్చరై అదుపు తప్పిన బస్సు.. ఇద్దరికి అస్వస్థత - పెద్దపెల్లి జిల్లా మంథని డిపో
తెలంగాణ రాష్ట్రంలో టైర్ పంక్చరై ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు ఒరిగిపోయింది. ఈ ఘటనలో కండక్టర్‌తో పాటు ఓ విద్యార్థి అస్వస్థకు గురయ్యారు.
అదుపు తప్పిన బస్సు
తెలంగాణ రాష్ట్రంలో పెద్దపెల్లి జిల్లా మంథని డిపో నుంచి ఇవాళ ఉదయం 6 గంటల 30 నిమిషాలకు ఎపీ29 జడ్ 2080 నెంబరు గల ఆర్టీసీ బస్సు ముత్తారం మండలం ఖమ్మంపల్లిలోని ఆదర్శ పాఠశాల నుంచి బయలుదేరింది. అడవి శ్రీరాంపూర్ గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో బస్సు టైర్ పంక్చర్ అయి అదుపుతప్పి రోడ్డు కిందికి దిగి ఒక పక్కకు ఒరిగిపోయింది.
బస్సులో ఉన్న విద్యార్థులు ఒకరిపై ఒకరు పడిపోయారు. విద్యార్థి రోహిత్, కండక్టర్ సుమలత అస్వస్థత గురికావడం వల్ల వెంటనే మంథని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు పంపించారు. ఈ బస్సులో సుమారు 45 మంది విద్యార్థులు ఉన్నారు.
Intro:Body:Conclusion: